prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 9:30 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

వరికి బదులు ఆరుతడి పంటలే మేలు: మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి

వరికి బదులు ఆరుతడి పంటలే మేలు: మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి


చెన్నారావుపేట జూలై 20 ప్రజావాణి

ఎల్-నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, వరికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని కాలనాయక్ తండా, బాపునగర్, ఖాదర్ పేట, లింగగిరి, బొజెర్వు, పుల్లభోడు తండాల్లో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూగర్భ జలాలు తగ్గి విద్యుత్‌పై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉనందున రైతులు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వైపు మళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు శశికుమార్, తిరుపతి, కరిష్మా,కిరణ్మయి,సర్పంచులు తిరుపతి, కుసుమ సతీష్, గూడా సంధ్య, మాలోతు రాంచంద్రు, మేడబోయిన రజిత, భూక్యా బద్రి,గ్రామ రైతులు తదితరులు పాల్గోన్నారు