వరద నీటిలో ప్రజలకు అండగా ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి కార్పొరేటర్
38వ డివిజన్‌లో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన నెలకంటి రాము బాధితులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌తో నేరుగా మాట్లాడించి భరోసా! గోదావరిఖని జూలై 29 ప్రజావాణి : మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు గోదావరిఖనిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 38వ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలనకు దిగారు. డివిజన్ పరిధిలోని అంబేద్కర్...