రోడ్డు ప్రమాద బాధితుడు బ్రెయిన్‌డెడ్ – అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు
ఘట్‌కేసర్, జూలై 20: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తిని వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించగా, ఆయన కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధేనువకొండ గ్రామానికి చెందిన గుంజి శ్రీను (40) ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో నివాసముంటూ మేస్త్రీ పనులు చేసుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీన తాపీ పని నిమిత్తం వెంకిరాల గ్రామానికి వెళ్లిన ఆయన, పని...