భారీ వర్షాలపై రామగుండం పోలీసుల హైఅలర్ట్ క్షేత్రస్థాయిలో సీపీ అంబర్ కిషోర్ ఝా పరిశీలన
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు గోదావరిఖని జూలై 29 ప్రజావాణి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం తీవ్ర అప్రమత్తమైంది. పెద్దపల్లి జోన్ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ (RFCL) ప్రాంతం నుండి డ్రైనేజీ కాలువల ద్వారా వరద నీరు వీర్లపల్లి గ్రామంలోకి చేరింది. ఈ సమాచారం అందుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ పర్యటనలో...