prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 7:43 am Digital Edition : PRAJA VANI

భారతీయ జనతా పార్టీ నూతనంగా ఎన్నికైన జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మేకల నరేష్<br><br><br>

భారతీయ జనతా పార్టీ నూతనంగా ఎన్నికైన జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మేకల నరేష్

నడి కూడా ప్రజావాణి 28

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ధరల పెరుగుదల వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ మేకల నరేష్ డిమాండ్ చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, సామాన్య ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు అందించడం, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలను కూడా చేపడతామని మేకల నరేష్ తెలిపారు. ప్రజలందరూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.