పోచారం 8వ డివిజన్‌లో వీధి దీపాల సమస్యలపై జోనల్ కమిషనర్‌కు వినతి…. బోనాల పండుగకు ముందే లైట్ల మరమ్మతులు పూర్తి చేయాలని విజ్ఞప్తి

ఘట్‌కేసర్, జూలై 20: పోచారం 8వ డివిజన్ పరిధిలో పనిచేయని వీధి దీపాలు, స్ట్రీట్ లైట్లు, హైమాస్ట్ లైట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కె. వినోద్ కుమార్ ఉప్పల్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శ్రీమతి రాధికను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు కాలనీలు, ప్రధాన రహదారుల్లో వీధి దీపాలు పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. రాత్రి వేళల్లో చీకటి నెలకొనడంతో ప్రజల భద్రతకు...