నసుల్లాబాద్ మండలంలో టైం బ్యాంకింగ్ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం

నసుల్లాబాద్ మండలంలో "టైం బ్యాంకింగ్" పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం     ప్రజావాణి ప్రతినిధి, కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలంలో గ్రామీణాభివృద్ధి, యువత సేవాభావం, స్వచ్ఛంద సేవా సంస్కృతి మరియు పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో "టైం బ్యాంకింగ్ (Time Banking)" పైలెట్ ప్రాజెక్టు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ట్రస్ట్ ప్రతినిధుల వివరాల ప్రకారం, ఈ పైలెట్ ప్రాజెక్టును తొలి దశలో నసుల్లాబాద్ మండలంలో అమలు...