చిన్న పత్రికలైనా,యూట్యూబ్ ఛానెళ్లయినా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభాలే: చిన్నచూపు చూసేవారికి కాలమే సమాధానం చెబుతుంది!

ఆంధ్రప్రదేశ్ జూలై 20 ప్రజావాణి పెద్ద మీడియా సంస్థలదే హవా,కార్పొరేట్ శక్తులదే రాజ్యం అనుకుంటూ,సమాజంలో క్షేత్రస్థాయి సమస్యలను వెలికితీసే చిన్న పత్రికలను,డిజిటల్ విప్లవంతో దూసుకుపోతున్న యూట్యూబ్ ఛానెళ్లను కొంతమంది చిన్నచూపు చూడటం వారి అజ్ఞానానికి పరాకాష్ట.కేవలం కోట్లాది రూపాయల టర్నోవర్ ఆకాశాన్నంటే భవనాలు ఉంటేనే మీడియా సంస్థలు అనుకుంటే పొరపాటే.నిజమైన జర్నలిజం సమాజపు అట్టడుగు వర్గాల గొంతుకను వినిపించడంలోనే ఉంది.ఈ రోజుల్లో సత్యనిష్టతో పనిచేస్తున్న చిన్న పత్రికలు,స్వతంత్ర యూట్యూబ్ జర్నలిస్టులు చేస్తున్న పోరాటం,పెద్ద పెద్ద కార్పొరేట్ మీడియా సంస్థల కంటే ఎంతో మిన్నగా ఉందనేది...