ఘట్‌కేసర్ లయన్స్ క్లబ్ 2026-27 తొలి సర్వసభ్య సమావేశం…….2026–27 సేవా కార్యక్రమాల కార్యాచరణపై విస్తృత చర్చ
ఘట్‌కేసర్, జూలై 20: లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ రెండో ఇన్‌స్టాలేషన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో నూతన కార్యవర్గం తొలి సర్వసభ్య సమావేశాన్ని క్లబ్ కార్యాలయంలో నిర్వహించింది. క్లబ్ అధ్యక్షుడు లయన్ రేసు లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రానున్న ఏడాదికి సంబంధించిన సేవా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి లయన్ బచ్చు నాగేష్ కుమార్ గుప్తా, మొదటి ఉపాధ్యక్షుడు లయన్ బచ్చు ప్రమోద్ గుప్తా, అడ్వైజర్ లయన్ మారం లక్ష్మారెడ్డి, రెండో ఉపాధ్యక్షుడు లయన్ చందుపట్ల లక్ష్మారెడ్డి,...