ఘట్‌కేసర్, జూలై 20: లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ రెండో ఇన్‌స్టాలేషన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో నూతన కార్యవర్గం తొలి సర్వసభ్య సమావేశాన్ని క్లబ్ కార్యాలయంలో నిర్వహించింది. క్లబ్ అధ్యక్షుడు లయన్ రేసు లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రానున్న ఏడాదికి సంబంధించిన సేవా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి లయన్ బచ్చు నాగేష్ కుమార్ గుప్తా, మొదటి ఉపాధ్యక్షుడు లయన్ బచ్చు ప్రమోద్ గుప్తా, అడ్వైజర్ లయన్ మారం లక్ష్మారెడ్డి, రెండో ఉపాధ్యక్షుడు లయన్ చందుపట్ల లక్ష్మారెడ్డి, డాక్టర్ జంగయ్య, ఆర్గనైజర్ లయన్ లక్ష్మీ హరినాథ్, డైరెక్టర్ లయన్ కమలాకర్ అల్లు, సభ్యత్వ కమిటీ చైర్మన్ లయన్ లంబ సత్యనారాయణ యాదవ్, లయన్ హిమబిందు, లయన్ మురళి, లయన్ రామ్మోహన్, లయన్ సారారాజు, లయన్ బాలరాజు యాదవ్, లయన్ మహేందర్ రెడ్డి, లయన్ జి. రవి, లయన్ ఎం. రాజ్‌కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రస్తుత నెలలో నిర్వహించనున్న సేవా కార్యక్రమాలతో పాటు 2026–27 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ, ప్రజా సంక్షేమం వంటి రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఉపయోగపడేలా పనిచేయాలని సభ్యులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా క్లబ్ నాయకులు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువ చేస్తూ సమాజాభివృద్ధికి తమ వంతు సేవలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.