గాజులమ్మగా కనులపండువగా దర్శనమిచ్చిన శ్రీ గోదాదేవి……గరుడాద్రి క్షేత్రంలో ఘనంగా లక్ష గాజుల మహోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

ఘట్కేసర్, జూలై 19: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్‌లోని ఉత్తర శ్రీవిల్లిపుత్తూరుగా ప్రసిద్ధి చెందిన గరుడాద్రి క్షేత్రం ఆదివారం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. శ్రీ గోదాదేవి (ఆండాళమ్మ) తల్లికి నిర్వహించిన లక్ష గాజుల మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో గాజులమ్మగా కొలువుదీరిన అమ్మవారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం గజవాహన సేవతో ఉత్సవాలు...