కాశినాయన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ నారిశెట్టి సుప్రజ
కాశినాయన జూలై 13 ప్రజావాణి మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సాధారణ సమావేశంలో బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ నారిశెట్టి సుప్రజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం,ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తోందని,ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి:రాబోయే ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని చైర్మెన్ సూచించారు.అర్హులైన...