prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 4:39 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కాశినాయన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ నారిశెట్టి సుప్రజ

కాశినాయన జూలై 13 ప్రజావాణి మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సాధారణ సమావేశంలో బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ  చైర్మెన్  నారిశెట్టి సుప్రజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం,ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తోందని,ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి:రాబోయే ప్రత్యేక ఓటర్ల సవరణ  కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని  చైర్మెన్ సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ స్థాయి అధికారులు నిర్దేశిత వాట్సాప్ గ్రూపులు మరియు ఇతర మాధ్యమాల ద్వారా సమన్వయం చేసుకోవాలన్నారు.ఈ ప్రక్రియలో ప్రజలు,ప్రజాప్రతినిధులు బ్లోలకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె కోరారు.ఈ సమావేశంలో ఎంపీపీ,జెడ్పీటీసీ,ఎంపీడీఓ,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,ఎంపీటీసీలు,కూటమి నాయకులు,మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.