prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 8:35 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఎస్పీ కమిషన్ చైర్మన్ జవహర్ ని కలిసిన కడప జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు

బ్రహ్మంగారి మఠం జూలై 03 ప్రజావాణి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు మండలంలో జరిగిన ఇద్దరు మాదిగ యువకుల జంట హత్యల కేసు విషయంపై నంద్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కె.ఎస్.జవహర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలసి చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17న కడప జిల్లాకు వస్తానని బ్రహ్మంగారి మఠం మండలంలో జరిగిన సంఘటన ప్రదేశాలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని తెలిపారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ కేసులో తీసుకోవాల్సిన చర్యలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వై.కె.విశ్వనాథ్ మాదిగ,జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర మాదిగ,గుండాల ఈశ్వరయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్ర పోగు సురేష్ మాదిగ,రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగ,రాష్ట్ర కార్యదర్శి దొమ్ము చిన్న మాదిగ,కడప జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మానికింది వెంకటేష్ మాదిగ,జిల్లా ఇన్చార్జి కె.మాతయ్య బాబు మాదిగ,మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షులు జీవన్ మాదిగ  తదితరులు పాల్గొన్నారు.