పోరుమామిళ్లలో అనుమతులు లేని ల్యాబ్‌ల గుట్టురట్టు: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 'సాయి లీల' నెట్‌వర్క్!* (పోరుమామిళ్ల -ప్రజావాణి న్యూస్ ప్రత్యేక కథన ) పోరుమామిళ్ల: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లలో నిబంధనలకు పాతరేస్తూ,ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్యాథాలజీ ల్యాబ్‌ల బాగోతం బట్టబయలైంది.పట్టణానికి చెందిన నాగేంద్ర అలియాస్ సాయి లీల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రధాన ల్యాబ్‌తో పాటు ఆయనకు అనుబంధంగా ఉన్న మరో నాలుగు ఆసుపత్రుల ల్యాబ్‌లలో దారుణమైన అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ నిబంధనలు,కనీస అర్హతలు లేకుండా ప్రజల ప్రాణాలను పణంగా...