విద్యార్థులకు మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
దుకాణదారులకు నేరేడుచర్ల పోలీసుల హెచ్చరికలు – పాఠశాల పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నేరేడుచర్ల, ప్రజావాణి జూన్ 10: త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు నేరేడుచర్ల పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం నేరేడుచర్ల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని పాఠశాలల పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణదారులకు అవగాహన కల్పించిన పోలీసులు, పాఠశాలల సమీప ప్రాంతాల్లో...