రైతు వేదికలో విత్తన మేళా..రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేసిన- మండల వ్యవసాయ అధికారి సంతోష్

  బెజ్జంకి,జూన్ 25 (ప్రజావాణి) వానాకాలం సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జూన్ 23 నుంచి 30 వరకు రైతు వేదికలలో విత్తన మేళాలు నిర్వహిస్తోంది.ఈ మేళాల ద్వారా రైతులకు నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ రైతు వేదికలో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి సంతోష్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .బిపిటి-5204 (సాంబ మసూరి), డబ్ల్యూజీఎల్-44 (వరంగల్...