రైతులకు సకాలం లో ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాము జేసి. ఇలక్కియ
ఎన్టీఆర్ జిల్లా జూన్ 11 ప్రజావాణి నందిగామ మండలం పెద్దవరం గ్రామం లో జరుగుతున్న భూముల రీ - సర్వే ప్రక్రియను గురువారం రోజున నందిగామ రెవిన్యూ డివిజనల్ ఆర్డీఒ.అనిల్ కుమార్,నందిగామ మండల తహశీల్దార్ సురేష్ బాబు వారితో కలిసి జేసీ.ఇలక్కియ పరిశీలించారు.ఈ సందర్భంగా నందిగామ రెవిన్యూ డివిజనల్ కార్యాలయం లో జెసి.ఇలక్కియ మీడియాతో మాట్లాడుతూ రైతులకు సకాలం లో ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.రీ- సర్వే పూర్తయిన గ్రామాల లో నూతన పాస్ పుస్తకాలు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.ఎరువుల...