prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 9:14 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రైతులకు సకాలం లో ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాము జేసి. ఇలక్కియ

ఎన్టీఆర్ జిల్లా జూన్ 11 ప్రజావాణి నందిగామ మండలం పెద్దవరం గ్రామం లో జరుగుతున్న భూముల రీ – సర్వే ప్రక్రియను గురువారం రోజున నందిగామ రెవిన్యూ డివిజనల్ ఆర్డీఒ.అనిల్ కుమార్,నందిగామ మండల తహశీల్దార్ సురేష్ బాబు వారితో కలిసి జేసీ.ఇలక్కియ పరిశీలించారు.ఈ సందర్భంగా నందిగామ రెవిన్యూ డివిజనల్ కార్యాలయం లో జెసి.ఇలక్కియ మీడియాతో మాట్లాడుతూ రైతులకు సకాలం లో ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.రీ- సర్వే పూర్తయిన గ్రామాల లో నూతన పాస్ పుస్తకాలు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.ఎరువుల అమ్మకాలు ఏ.పి. ఏ.ఐ.ఎం.ఎస్ యాప్ ద్వారానే నిర్వహించాలి. నందిగామ రెవిన్యూ డివిజన్ పరిధిలో యోగాంద్ర -2026 కార్యక్రమాలు జూన్ – 21 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.నందిగామ రెవిన్యూ డివిజన్ పరిధిలో అన్ని ప్రభుత్వ పథకాలు అర్హులకు సకాలంలో అందుతున్నాయని జేసీ.ఇలక్కియ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో ఆర్డిఓ.అనిల్ కుమార్ నందిగామ మండల తహశీల్దార్ సురేష్ బాబు, ఇతర రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.