బెజ్జంకి మండల వడ్డెర సంఘం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన – సర్పంచ్ స్వరూప భాస్కరాచారి

బెజ్జంకి, జూన్ 17(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వడ్డెర సంఘం నూతన కమిటీ సభ్యులకు చీలాపూర్ గ్రామ సర్పంచ్ స్వరూప భాస్కరాచారి శుభాకాంక్షలు తెలిపారు. మండల వడ్డెర సంఘం అధ్యక్షుడిగా చీలాపూర్‌పల్లె గ్రామానికి చెందిన సురేష్, ప్రధాన కార్యదర్శిగా కుంచం రాజు, యూత్ అధ్యక్షుడిగా దాండ్ల రాము నియామకమైన సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ స్వరూప భాస్కరాచారి మాట్లాడుతూ, వడ్డెర సంఘం నూతన కమిటీ సభ్యులు తమ కుల అభివృద్ధికి కృషి చేస్తూ అన్ని రంగాల్లో పురోగతి...