బెజ్జంకి మండలంలో సీపీఐ మార్కెట్ సర్వే నిర్వహణ ” నిత్యావసర వస్తువుల ధరలు, కార్మికుల వేతనాల వివరాల సేకరణ”
బెజ్జంకి,జూన్ 15(ప్రజావాణి ) కేంద్ర గణాంక శాఖ కరీంనగర్ ఉపప్రాంత కార్యాలయం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) మార్కెట్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఉపప్రాంత కార్యాలయ సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గోవర్ధన శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పర్యటించి నిత్యావసర వస్తువుల ధరలు, కార్మికుల వేతనాల వివరాలను సేకరించారు. ద్రవ్యోల్బన గణనలో కీలక పాత్ర పోషించే ఈ డేటా సేకరణ ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. సర్వే సందర్భంగా గణాంక శాఖ సిబ్బంది పెద్ది వీరేశం...