prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 1:29 pm Digital Edition : RAJASHEKARREDDY

బెజ్జంకి మండలంలో సీపీఐ మార్కెట్ సర్వే నిర్వహణ ” నిత్యావసర వస్తువుల ధరలు, కార్మికుల వేతనాల వివరాల సేకరణ”

 

బెజ్జంకి,జూన్ 15(ప్రజావాణి )

కేంద్ర గణాంక శాఖ కరీంనగర్ ఉపప్రాంత కార్యాలయం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) మార్కెట్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఉపప్రాంత కార్యాలయ సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గోవర్ధన శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పర్యటించి నిత్యావసర వస్తువుల ధరలు, కార్మికుల వేతనాల వివరాలను సేకరించారు.
ద్రవ్యోల్బన గణనలో కీలక పాత్ర పోషించే ఈ డేటా సేకరణ ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. సర్వే సందర్భంగా గణాంక శాఖ సిబ్బంది పెద్ది వీరేశం నిర్వహిస్తున్న పనితీరును పరిశీలించి అభినందించారు. ధరల సూచిక (ప్రైస్ ఇండెక్స్) తయారీకి అవసరమైన సమగ్ర సమాచారాన్ని నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సర్వే నిరంతర ప్రక్రియలో భాగమని, ప్రజలు, వ్యాపారులు మరియు సంబంధిత వర్గాలందరూ గణాంక శాఖ అధికారులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.