బీసీ గురుకులంలో సమస్యల వలయం.. విద్యార్థుల ఆందోళన

బీసీ గురుకులంలో సమస్యల వలయం.. విద్యార్థుల ఆందోళన ప్రజావాణి ప్రతినిధి, బీర్కూర్: బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కొరత విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ విద్యాసంస్థలో 5వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు మొత్తం 580 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకారంతో 2023లో ఈ పాఠశాల ప్రారంభమైంది. విద్యార్థులకు వసతి గృహ సౌకర్యం ఉన్నప్పటికీ, సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర...