ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ కోచింగ్ వ్యాపారం..! చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి అనిల్

పోరుమామిళ్ల జూన్ 23ప్రజావాణి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేయాల్సిన కొందరు ఉపాధ్యాయులు“సంకల్ప కోచింగ్“ఐఐటీ అకాడమీ”సైనిక్-నవోదయ-ఆర్‌ఎంఎస్ కోచింగ్”పేర్లతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ విద్యను వ్యాపారంగా మార్చారని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి అనిల్ తీవ్రంగా ఆరోపించారు. వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే తల్లిదండ్రుల ఆశలు, విద్యార్థుల భవిష్యత్తును పెట్టుబడిగా మార్చుకుని భారీ మొత్తాల్లో ఫీజులు వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు.ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉన్నవారు, అదే...