సిద్దిపేట్ జగదేవపూర్, జూన్ 13, ప్రజావాణి
జగదేవపూర్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్ డి సి చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గం బి అర్ ఎస్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి జన్మదిన సందర్భంగా జగదేవపూర్ మండలానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు హరిగౌడ్ శనివారం గజ్వేల్ క్యాంప్ కార్యాలయంలో ప్రతాప్ రెడ్డి నీ కలిసి ఫోటో ఫ్రేమ్ అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ సందర్భంగా హరి గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుతున్నట్లు చెప్పారు,తెలంగాణ రాజకీయాల్లో గజ్వేల్ లో “ట్రబుల్ షూటర్” గజ్వేల్ టైగర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు వంటేరు ప్రతాప్ రెడ్డి అని అన్నారు,పేదల పెన్నిధి జన హృదయ నేతగా వ్యూహకర్తగా, పార్టీకి అండగా నిలిచిన నేతగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు అని చెప్పారు,కేసీఆర్‌కు అత్యంత నమ్మకమైన సహచరుడిగా రాజకీయ ప్రయాణం ప్రారంభింస్తున్న ప్రతాప్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు కీలక పాత్ర పోషించారు అని ఆయన పేర్కొన్నారు,ప్రతాప్ రెడ్డి అంటే ప్రజా నాయకుడు అని అలుపెరుగని శ్రామికుడు నిరంతరం ప్రజల పక్షాన నిలబడే మంచి నాయకుడు ప్రతాప్ రెడ్డి అని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతున్ని వేడుకుంటున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వారి వెంట పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ శీను, గ్రామ అధ్యక్షులు సుధాకర్ ఉపసర్పంచ్ మల్లేశం, మాజీ సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.