prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 11:00 am Digital Edition : PRAJA VANI

పోసన్పల్లి లో గోటు విలేజ్ కార్యక్రమం నిర్వహణ <br>

పోసన్పల్లి లో గోటు విలేజ్ కార్యక్రమం నిర్వహణ

మన సమగ్ర ప్రజావాణి జూన్ 22
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

మాదిగ సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన బలం అనే లక్ష్యంతో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో  పోసన్ పల్లి గ్రామంలో గోటు విలేజ్ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గో టు విలేజ్ కార్యక్రమం పోసన్ పల్లి గ్రామంలో  రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నల్లోల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి హాజరై యువతకు దిశానిర్దేశం చేశారు.వారు మాట్లాడుతూ
మాదిగ సమాజ భవిష్యత్తు విద్యతోనే మారుతుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను  ఇప్పటి నుంచే పాఠశాలకు పంపించి ఉన్నత చదువులు చదివించాలి అని పిలుపునిచ్చారు.

10వ తరగతి అనంతరం విద్యార్థులు పాలిటెక్నిక్, అగ్రికల్చర్, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో చేరాలని, ఇంటర్‌లో ఎంపీసీ , బైపీసీ , హెచ్ ఈ సి  గ్రూపులను ఎంచుకొని ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలని సూచించారు. డిగ్రీలు, పీజీలు, ఎంఫిల్, పీహెచ్‌డీలు చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ప్రేరణనిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్  చౌటకూరు మండల అధ్యక్షులు, విద్యార్థులు గ్రామ  నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.