prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 5:52 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పసుపులేటి సాయి ప్రసాద్ ఆహ్వాన మేరకు విందుకు హాజరైన డిసిసి బ్యాంక్ చైర్మన్

కోడిగుడ్లపాడు గ్రామానికి బస్ సౌకర్యం కల్పిస్తాం.హామీ ఇచ్చిన డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి

కాశినాయన (జూన్ 15 ప్రజావాణి)మండలంలోని కోడిగుడ్లపాడు గ్రామానికి చెందిన పసుపులేటి సాయి ప్రసాద్ ఆహ్వానం మేరకు విందుకు హాజరైన కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి,బద్వేల్ నియోజకవర్గం టిడిపి నాయకులు కర్నాటి వెంకటరెడ్డి హాజరయ్యారు. కోడిగుడ్లపాడు గ్రామస్తులు వీరికి ఘన స్వాగతం పలికారు. మొదట సూర్యనారాయణ రెడ్డి నరసాపురంలోని తెలుగుదేశం నాయకులు కర్నాటి వెంకట రెడ్డి ఇంటికి వెళ్లి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.అనంతరం కాశినాయన జ్యోతిక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం కోడిగుడ్లపాడు గ్రామంలో పసుపులేటి సాయిప్రసాద్,గుర్రాల బాలవెంకటరెడ్డి, పిచ్చపాటి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పసుపులేటి సాయిప్రసాద్ మంచూరు సూర్యనారాయణరెడ్డి దృష్టి కి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు.అందులో కోడిగుడ్లపాడుకు గతం లో ఆర్టీసీ బస్సు నడుస్తుండేదని, కొంత కాలం క్రితం ఆర్టీసీ అధికారులు రద్దు చేశారన్నారు. అందుకు సూర్యనారాయణరెడ్డి త్వరలో కోడిగుడ్లపాడుకు బస్సు సౌకర్యం కల్పించేలా ఆర్టిసి అధికారులతో చర్చిస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ సిద్ధంగా ఉండాలని,అన్ని స్థానాలను కూటమి ప్రభుత్వం కైవాసం చేసుకునేందుకు సిద్ధం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పామూరి బాలిరెడ్డి,చెరుకూరి రవికుమార్,కల్లూరి దుగ్గిరెడ్డి ప్రహల్లాద రెడ్డి, బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి,ఎదురు భాస్కర్ రెడ్డి,బిజీవేముల నారాయణరెడ్డి టిడిపి కోడిగుడ్లపాడు నాయకులు పిచ్చిపాటి రామకృష్ణారెడ్డి పిచ్చపాటి యోగేశ్వరరెడ్డి,పోతుగంటి చిన్న పీరయ్య, పోతుగంటి శ్రీనివాసులు,గుర్రాల రమణారెడ్డి అయ్యలూరి రాజారెడ్డి,తలపురెడ్డి రామగురిరెడ్డి,అయ్యలూరి చంద్రశేఖరరెడ్డి,ఆయలూరి చెన్నారెడ్డి,నల దేశి నారాయణ,నలిదేశి లక్ష్మయ్య,నవదీసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు