ప్రజావాణి మోతే జూన్ 12:ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మరియు సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ నీటి సంరక్షణ, గంజాయి డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల పై అవగాహన తదితర అంశాలపై మోతే మండల హెడ్ క్వార్టర్లు, వివిధ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మామిళ్ళగూడెం గ్రామ సర్పంచ్ నాగమణి వీరాస్వామి , సెక్రెటరీ కవిత , ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి వార్డు మెంబెర్ గంగరాజు ,ఆశవర్కర్ సుభద్ర,గ్రామ ప్రజలు మధు, యల్లారెడ్డి గ్రామ సిబ్బంది మరియు కళాకారులు *టీం లీడర్ వేముల శ్రవణ్,* వెన్నెలనాగరాజు, లక్ష్మి, సైదులు, వేణు, స్రవంతి, శిరీష,ప్రియాంక, ప్రియదర్శిని, ఇంద్రజ పాల్గొన్నారు