prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 3:23 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

డోర్ లేకుండా ట్రాక్టర్ రవాణా, రూ.1,000 జరిమానా విధించిన కార్యదర్శి

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటలో వెనుక డోర్ లేని ట్రాక్టర్ ట్రాలీతో నిర్లక్ష్యంగా మోరం (మట్టి, రాళ్లు) తరలిస్తున్న డ్రైవర్‌కు పంచాయతీ కార్యదర్శి షాక్ ఇచ్చారు. ప్రయాణంలో ఆ రాళ్లు రోడ్డుపై పడి ప్రజల రాకపోకలకు విఘాతం కలిగించాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన కార్యదర్శి, ప్రజా భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు సదరు డ్రైవర్‌కు రూ.1,000 జరిమానా విధించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.