టీడీపీ రాజకీయ కక్షతోనే బండి నిత్యానందరెడ్డి అరెస్ట్. జైలు నుండి విడుదలైన నిత్యానందరెడ్డి ని పరామర్శించిన రెడ్యం.
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజావాణి జూన్ 18) అలంఖాన్పల్లె కు చెందిన కలమల్ల పెద్ద దస్తగిరి హత్య కేసులో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని అరెస్ట్ చేయడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి బెయిల్పై విడుదలైన బండి నిత్యానందరెడ్డిని గురువారం ఆయన నివాసంలో పరామర్శించిన రెడ్యం, జరిగిన పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బండి నిత్యానందరెడ్డి తనను ఎలాంటి...