prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 1:13 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు

కడప ప్రజావాణి జూన్పో 11 పోరుమామిళ్ల లోని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో బద్వేలు నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ ,నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి, నాయకత్వం వహించగా, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, యువకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.కార్యక్రమం ప్రారంభంలో నల్ల బెలూన్లు ఎగరవేసి కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ఎన్నికల ముందు రైతులు,మహిళలు,యువత, నిరుద్యోగులు మరియు పేద ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలు, సాగునీటి భరోసా కల్పిస్తామని చెప్పి వారిని అప్పుల ఊబిలోకి నెట్టారని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఆర్థిక భరోసా, పేదలకు సంక్షేమ పథకాలు, నిరుద్యోగ భృతి, సూపర్ సిక్స్ హామీలు వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసిన ప్రభుత్వాలకు చరిత్రలో ఎప్పుడూ ప్రజలే గుణపాఠం చెప్పారని, అదే విధంగా ఈ ప్రభుత్వానికి కూడా తగిన సమయంలో ప్రజలు తమ తీర్పు ఇవ్వడం ఖాయమని నాయకులు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ,రైతులు,యువత, మహిళలు మరియు అన్ని వర్గాల ప్రజల పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.అలాగే రానున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై చర్చిస్తూ ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని హామీ ఇచ్చారు.అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి ప్రజలకు వివరాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.