ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘట్‌కేసర్, జూన్ 20: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఘట్‌కేసర్ 6వ డివిజన్, ఎదులాబాద్ 7వ డివిజన్, పోచారం 8వ డివిజన్‌లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి...