ఘట్కేసర్, జూన్ 20: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఘట్కేసర్ 6వ డివిజన్, ఎదులాబాద్ 7వ డివిజన్, పోచారం 8వ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరై కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల బలోపేతం కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. యువత, రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న పోరాటం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ముత్యాల్ యాదవ్, మండల అధ్యక్షుడు కర్రే రాజేష్, మున్సిపల్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మచ్చేందర్ రెడ్డి, సగ్గు అనిత, సామల అమర్, మెరుగు నరేష్ గౌడ్, నానావత్ రూప్ సింగ్ నాయక్, వెంకటేష్ ముదిరాజ్, కందుల కుమార్, విశ్వనాథం, గట్టగల్ల రవి, కవాడి మాధవ్ రెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, కంచెర్ల వెంకట్ రెడ్డి, నర్రి శ్రీశైలం, ప్రభాకర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, భోజీ రెడ్డి, నర్సింగ్ ముదిరాజ్, ఉదయ్ కుమార్ రెడ్డి, గంగి శంకర్, డొంకని శంకర్ గౌడ్, మెట్టు రమేష్, మెట్టు నర్సింహా, జవాజీ సత్తయ్య, ఎర్ర మాధవి రాజు, బద్దం మల్లికార్జున్ రెడ్డి, శంకర్ రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, మెట్టు గణేష్ యాదవ్, ఉల్లి ఆంజనేయులు యాదవ్, దేవేందర్ ముదిరాజ్, బర్ల రాధాకృష్ణ, సగ్గు శ్రీనివాస్, గుర్జకుంట నర్సింహా, ఫరూక్, రహమాన్, నానావత్ సురేష్ నాయక్, మోత్కూపల్లి శ్రీనివాస్, సహదేవ్ గౌడ్, వినోద్ కుమార్, శివాజీ నాయక్, విజయ్ కుమార్, గంధం రమేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
