గుల్లకోటలో ఘనంగా ‘ప్రజాపాలన ప్రగతి’ గ్రామసభ

ఎండపల్లి మండలం గుల్లకోటలో ఈరోజు 'ప్రజాపాలన ప్రగతి' గ్రామసభను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామంలోని అభివృద్ధి పనులు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృపాకర్, ఎమ్మార్వో అనిల్, ఎస్ఐ ఉదయ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయికుమార్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.