గుగ్గిళ్ళలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం పునర్నిర్మాణానికి శ్రీకారం
బెజ్జంకి, జూన్ 18 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ళ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం పునర్నిర్మాణ కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, గ్రామస్థుల సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన అనంతరం భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామ ఆధ్యాత్మిక వైభవం మరింత పెరుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గుగ్గిళ్ళ గ్రామ గౌడ సంఘం నాయకులు...