prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 11:23 am Digital Edition : RAJASHEKARREDDY

గుగ్గిళ్ళలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం పునర్నిర్మాణానికి శ్రీకారం

బెజ్జంకి, జూన్ 18 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ళ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం పునర్నిర్మాణ కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, గ్రామస్థుల సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన అనంతరం భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామ ఆధ్యాత్మిక వైభవం మరింత పెరుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గుగ్గిళ్ళ గ్రామ గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ, దేవస్థానం అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దాతలు, భక్తులు తమ వంతు ఆర్థిక సహకారం అందించి ఆలయ పునర్నిర్మాణాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజలు, దాతల సహకారంతో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, భక్తులకు మరింత సౌకర్యవంతమైన దేవాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.రేణుక ఎల్లమ్మ దేవస్థానం పునర్నిర్మాణానికి విరాళాలు అందించదలిచిన దాతలు ఫోన్‌పే/గూగుల్‌పే: 9550265807 ద్వారా తమ వంతు సహాయాన్ని అందించి దేవస్థానం అభివృద్ధికి తోడ్పడాలని గౌడ కుటుంబ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.