కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ. 20,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన డిప్యూటీ తహసిల్దార్ పృథ్వీ

ప్రకాశం జిల్లా జూన్ 15 ప్రజావాణి) కనిగిరి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (ఆర్డీవో ఆఫీస్)లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడి చేశారు. ఒక రైతు నుంచి అధికారిక పని కోసం రూ. 20,000 లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసిల్దార్ పృథ్వీరాజ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.కార్యాలయంలోనే లంచం సొమ్ముతో దొరికిపోవడంతో రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.బాధిత రైతు తన భూమికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఫైలు/ధృవీకరణ పత్రం మంజూరు కోసం కనిగిరి ఆర్డీవో కార్యాలయం చుట్టూ గత కొన్ని...