అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే దేశం మరో 5000 సంవత్సరాలు వెనుకబడిపోయేది – చిలుగురి శ్రీకాంత్
ఘట్కేసర్, జూన్ 14: ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న 270వ వారపు నిత్య పూలమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరుంధతీ యువజన సంఘం మర్పల్లిగూడ అధ్యక్షుడు చిలుగురి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు చిలుకూరి నిఖిల్, కార్యదర్శి ఈడుగళ్ల అశోక్ హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిలుగురి శ్రీకాంత్ మాట్లాడుతూ, “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించకపోయి ఉంటే...