prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 8:47 am Digital Edition : PRAJA VANI

అందోల్‌లో నేడు టీవైజేఎఫ్ ఐడీకార్డ్ మరియు హెల్త్ కార్డుల పంపిణీ<br>

అందోల్‌లో నేడు టీవైజేఎఫ్ ఐడీకార్డ్ మరియు హెల్త్ కార్డుల పంపిణీ

*మన సమగ్ర ప్రజావాణి జూన్ 20 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి*

అందోల్ నియోజకవర్గంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్  యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఐడీ కార్డులు మరియు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం నేడు నిర్వహించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రావు తనుగుల ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు, టీవైజేఎఫ్ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత మరియు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి టీవైజేఎఫ్ కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.