prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 8:55 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జలధార కార్యక్రమాన్ని జిల్లాలో చక్కటి ప్రణాళికతో అమాలు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప జిల్లా (మే19 ప్రజావాణి)

నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల భాగస్వాములతో జలాధార కార్యక్రమాల ప్రణాళికలతో మరింత ప్రధాన్యతతో పటిష్టంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి తెలిపారు.

శనివారం సాయంత్రం రాష్ట్ర సీఏడీఏ ప్రత్యేక కమిషనర్ ఆదేశాల మేరకు.. జలధార–జలహారతి కార్యక్రమంపై రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషన్ కుమార్ అన్ని జిల్లాల కాలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తోపాటు, రాజంపేట సబ్ కలెక్టర్ & కేఎంసి కమీషనర్ హెచ్.ఎస్. భావన హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ కడప జిల్లాలో “సాగు నీటి సంఘాల బాధ్యత”తో.. “జలధార- జల హారతి” కార్యక్రమం కింద మండలాల వారీగా చెరువుల అభివృద్ధి, ప్రణాళికల రూపకల్పన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 670 మైనర్ ఇరిగేషన్ (ఎంఐ) చెరువులు ఉండగా, ఆయా గ్రామాలు జలధార నిర్వహణ ప్రణాళిక పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఆ మేరకు అన్ని మండలాల్లో జలధార పనులు 60% మేరకు గ్రౌండింగ్ చేపట్టి శరవేగంగా జరుగుతున్నాయన్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ అబ్దుస్ సమీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యుఎస్ డిడి మురళిధర్, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా అధికారులు తదితరులు పాల్గొన్నారు…