స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) పోలీస్.స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి.సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్,ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ జి.వి.రమణమూర్తి,శ్రీ ఏ.హనుమంతు,మరియు ఇతర పోలీసు అధికారులు కలిసి ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులు మాట్లాడుతూ,అల్లూరి సీతారామరాజు,భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు.బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను...