స్నానాల గదిలో జారిపడి వృద్ధురాలు మృతి

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మే 26 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాకాపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఇత్తినేని లక్ష్మి (70) అనే వృద్ధురాలు మరణించింది. ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.... శాకాపూర్ గ్రామానికి చెందిన ఇత్తినేని లక్ష్మి గత రెండేళ్లుగా స్థానికంగా ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. అయితే, మంగళవారం రోజున ఆమె ఉంటున్న ఇళ్ల నుంచి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించిన ఇంటి యజమాని రాజు.....