prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 6:58 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సిమెంటు బల్కర్ లారీ బోల్తా

కడప జిల్లా (మే21 ప్రజావాణి)  మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామం HP పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం ప్రొద్దుటూరు కు చెందిన సిమెంట్ ట్యాంకర్ లారీ ప్రమాదానికి గురై బోల్తా పడింది.దాల్మియా సిమెంట్ పరిశ్రమలో సిమెంట్ లోడింగ్ చేయించుకుని జమ్మలమడుగు వైపు వెళుతుండగా లారీ అదుపుతప్పి ప్రమాదం చోటు చేసుకుంది.ఈ కథలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ సహాయంతో అతడిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.లారీ ముందుగా వెళుతున్న ట్రాక్టర్ ను ఓవర్ టెక్ చేయబోయి ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు