prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 8:22 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి,,జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ తెలిపారు

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే09) వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభలు ఈనెల మే 11, 12, 13 తేదీలలో అమలాపురం పట్టణం జరుగుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ తెలిపారు జిల్లా కార్యాలయంలో 30 వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అన్వేష్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల సందర్భంగా అమలాపురం పట్టణం లో ఈనెల మే 11వ తేదీన భారీ ప్రదర్శన,బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.ఈ సభకు అఖిలభారత అధ్యక్షులు ఏ.విజయరాఘవన్, ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలోనూ ఉత్పత్తికి మూలకారకులైన వ్యవసాయ కార్మికుల హక్కుల రక్షణ కోసం అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో 1934లో వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా అలగానపాడు గ్రామంలో ఏర్పడిందని తెలిపారు.భూమి కోసం,భుక్తి కోసం,కష్టజీవులు విముక్తి కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమరశీల ఉద్యమాలు సాగిస్తుందని,విరోచిత మైన భూపారాట పోరాటాలలో వేలాది ప్రాణ త్యాగాలు బలిదానాలు జరిగాయి తెలిపారు.రాష్ట్ర మహాసభల్లో గ్రామీణ పేదల సమస్యలన్నీ సమగ్రంగా చర్చిస్తామని, వాటి పరిష్కారానికి పోరాటాలు రూపొందిస్తామని తెలిపారు.వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు కడప జిల్లా ప్రతినిధులు 16 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‌సంఘం జిల్లా కమిటీ సభ్యులు పి మధు పి రఘు పాల్గొన్నారు