prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 9:22 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వీఆర్వోల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు..  చేస్తున్నారంటూ రైతుల ఆగ్రహం!

పోరుమామిళ్ల, (మే19 ప్రజావాణి) వీఆర్వోల తీరు అనేక విమర్శలకు తావిస్తోంది.విలేజ్‌ రివిన్యూ ఆఫీసర్లుగా గ్రామస్థాయిలో పనిచేస్తున్న వీరిలో చాలా మందికి డిపార్ట్‌మెంట్‌ పనుల్లో పట్టులేకపోవడమే కాదు.కనీస అవగాహన,అక్షర జ్ఞానం లేకపోవడం కనిపిస్తోంది.అయితే దీనికి ఒక మందును కనిపెట్టారు సదరు వీఆర్వోలు.పని రాకపోయినా పైరవీల్లో మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉండేందు.బల్లకింద చేయిపెట్టి. చేతి తడిపితేనే. గ్రామస్థాయిలో భూ సంబందమైన ఏ పనులు కావాలన్నా వీఆర్వోలే అత్యంత కీలకం.ఇదే అదనుగా పత్రీ పనికి బల్లకింద చేయిపెట్టి మరీ ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు పలువురు వీఆర్వోలపై వస్తున్నాయి. ప్రధానంగా భూ సంబందిత మ్యుటేషన్లు, పట్టాదారు పాస్‌బుక్‌లు, టైటిల్‌ డీడ్‌లు, ఇళ్ల పట్టాల పునరుద్దరణ, ఫ్రభుత్వ భూముల్లో పట్టాల జారీ ఇలా ఒక్కటేంటి దశ దారుల్లో దోపిడీ పర్వానికి తెగబడుతున్నారన్న ఆరోపణలు చాలా మంది వీఆర్వోలపై వస్తున్నాయి. అంతే కాకుండా తహసీల్దార్‌లను సైతం ఏమార్చి అడ్డగోలుగా రికార్డుల్లో మార్పులు చేసి ఆపై పత్రాలు సృష్టిస్తున్నారని బయట పడ్డ పలు కేసులను బట్టి అర్ధం అవుతుందంటున్నారు. గ్రామస్థాయిలో రికార్డు అంతా సిద్ధం చేసి ఆపై తహసీల్దార్‌ సంతకం కోసం ప్రయత్నించే క్రమంలో తహసీల్దారులు కొన్ని సమయాల్లో లోపాలను చూడకుండా సంతకాలు చేస్తే వారు ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయంటున్నారు.ఉదాహరణకు గతంలో బి కోడూరు  మండలంలో పనిచేసిన తహసీల్దార్‌,ఓ వీఆర్వో, చేసిన కక్కుర్తి పనికి  ఆయన బలై జైలుపాలయ్యడూ.అడ్డగోలు పనులకు  గ్రామాల్లో ఉంటూ రెవిన్యూ సంబందిత సమస్యల పరిష్కారానికి, ఉన్నతాధికారులకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కానీ పని ఓ చోట, నివాసం మరో చోట ఉండడమే కాకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా కేవలం బయట పనుల్లో ఉంటున్నారని చాలా మంది వీఆర్వోల విషయంలో ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామస్థాయిలో భూ సంబందిత రికార్డుల నిర్వహణకు వీఆర్వోలే కీలకం కాగా అడ్డగోలు పనులకు లంచాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న కొందరు రివిన్యూ రికార్డుల పనుల్లో,కొందరు అయితే వసూళ్ల పర్వానికి పాల్పడుతుండగా మరికొందరు.కారుణ్య నియామకం కింద వీఆర్వోలుగా ప్రమోషన్లు పొందిన వారు కొందరు సచివాలయాల్లో ఉండకుండా ప్రయివేటు పనుల్లో నిమగ్నమవ్వడం,ఇది ఎక్కువగా  బద్వేల్ నియోజకవర్గం లోని పోరుమామిళ్ల, కలసపాడు,కాశినాయన,బి కోడూరు,మండలాల్లో కనిపిస్తోంది.మిగతా వివరాలు  రేపటి సంచికలో వీఆర్వో పేర్లతో సహా ప్రజావాణిలో దినపత్రికలో