prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 6:56 am Digital Edition : MEERASAHAB CHILUKUR

*వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దు చిలుకూరు ఎస్ఐ హనుమా నాయక్* *ఎస్పీ కె నరసింహ ఆదేశాల మేరకు మండల కేంద్రం లోని కట్టకొమ్ము గూడెం గ్రామం లో “పోలీస్ ప్రజా భరోసా” కార్యక్రమం*

*చిలుకూరు మే26(ప్రజావాణి)*:ఎస్పీ కె నరసింహ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రామాపురం (కట్టకొమ్ము గూడెం) గ్రామంలో “పోలీస్ ప్రజా భరోసా” కార్యక్రమం ద్వారా, రైతులు ఎండిన వరి కొయ్యలకు నిప్పు పెట్టకూడదని, నకిలీ విత్తనాలపై అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, షీ టీమ్స్ పైన పోలీసు కళాభృందంతో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎస్ఐ హనుమాన్ నాయక్  మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే నరసింహ అధ్వర్యంలో నకిలీ విత్తనాలు, సైబర్ నేరాలపై, సీసీ కెమెరాల ఉపయోగం పై,రోడ్డు నియమ నిబంధనలపై, బాల్య వివాహాల నిర్మూలన పై, గంజాయి మత్తు పదార్థాలపై, షీ టీమ్స్ పై పటిష్టంగా పనిచేస్తున్నమని తెలిపారు. చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు,  బ్యాంక్ ఖాతా ఏటిఎం కార్డ్ వివరాలు,ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.
ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే కోదాడ షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి. ఆకతాయిలు ఎవరైనా అల్లరి పెట్టినట్లయితే వేధించినట్లయితే   షీ టీం కి సమాచారం ఇవ్వండి.మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. గ్రామాలలో ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానం అని అన్నారు.అనంతరం పోలీసు  కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్  వేమూరి సతీష్,  పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీను, వీరబాబు పోలీస్ కళా బృందం ఇంచార్జి యల్లయ్య,సభ్యులు గోపయ్య,  సత్యం,చారి,కృష్ణ,నాగార్జున, గురు లింగం,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.