prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 3:02 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రాయలసీమ సాధన కోసం పోరాడుతాం – కాకాణి “

నెల్లూరు జిల్లా,ప్రజావాణి న్యూస్ (మే05) గాంధీ నగర్ లోని RSN కన్వెన్షన్ సెంటర్ లో మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు”డా”కాకాణి గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పధకం భవిష్యత్తు కార్యచరణ పై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సాకే శైలజా నాద్,జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,మేరిగ మురళీధర్,మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి,మేకపాటి విక్రమ్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి,ఉదయగిరి నియోజకవర్గం ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి,వెంకటగిరి నియోజకవర్గం ఇంచార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి,పుత్తా శివశంకర రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి,రైతు సంఘం నాయకులు నియోజకవర్గ పార్టీ పరిశీలకులకులు,జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు,రైతులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి,నివాళులర్పించిన వైఎస్ఆర్ సీపీ నాయకులు, రైతు సంఘాల నాయకులు కాకాణి ఆధ్వర్యంలో నిర్వహించిన “రాయలసీమ ఎత్తిపోతల పధకం భవిష్యత్తు కార్యచరణ” రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు,రైతు సంఘాల నాయకులు,కాకాణి ప్రసంగంతో ఈలల చప్పట్లతో మారుమ్రోగిన సభా ప్రాంగణం నెల్లూరు జిల్లా ఆత్మగౌరవాన్ని,ప్రయోజనాలను కాపాడిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై చంద్రబాబు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారన్న నెల్లూరు రైతాంగ ప్రయోజనాలే వైయస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యంగా పనిచేశారన్న  సోమశిల జలాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతో కీలకమన్న ​రాయలసీమ ఎత్తిపోతల పథకం, సాగునీటి లభ్యత,రాయలసీమ ప్రాజెక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించిన కాకాణి-రాయలసీమ హక్కుల సాధన కోసం మరియు సాగునీటి ప్రాజెక్టుల పురోగతి కోసం రాబోయే రోజుల్లో కార్యాచరణ మరింత బలోపేతం చేస్తాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎలా సాధించుకోవాలనే అంశంపై మేధావులు, రైతులు మరియు నాయకులందరితో సమీక్ష నిర్వహించి,వారి అమూల్యమైన సూచనలు,సలహాలు తీసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం- రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల కేవలం రాయలసీమ జిల్లాలే కాకుండా,నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవశ్యకతపై అందరికీ పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది వ్యవసాయం అనేది ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది,​పంటలు పండించుకోవడానికి అవసరమైన సాగునీరు.​పండించిన పంటకు లభించే గిట్టుబాటు ధర వ్యవసాయానికి సాగునీరే మూలాధారం,సాగునీటి విషయంలో జరుగుతున్న అన్యాయంపై గళం ఎత్తాల్సిన సమయం ఆసన్నమైంది- రైతు బ్లాక్ మార్కెట్‌లో యూరియా కొనుక్కుంటున్నాడు,ఇతర వనరులను సమకూర్చుకుంటున్నాడు కానీ సాగునీరు మరియు గిట్టుబాటు ధర అనేవి ప్రభుత్వం కల్పించాల్సిన కనీస అవసరాలు. వీటిపైనే వ్యవసాయం మనుగడ సాగుతుంది- శ్రీశైలం తర్వాత రాష్ట్రంలోనే అత్యంత భారీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జిల్లా నెల్లూరు నెల్లూరు జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు సోమశిల జలాశయం 78 టీఎంసీలు.కండలేరు జలాశయం 68 టీఎంసీలు.మొత్తం సామర్థ్యం:దాదాపు 146 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ రెండు ప్రాజెక్టులకే ఉంది గతంలో జిల్లాల పునర్విభజన సమయంలో కండలేరు రిజర్వాయర్ ఉన్న ప్రాంతాన్ని మరియు రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపే ప్రతిపాదన వచ్చినప్పుడు,దానివల్ల భవిష్యత్తులో నీటి వినియోగంపై వివాదాలు తలెత్తే అవకాశం ఉందని మేము అప్పటి ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాం- శ్రీశైలం ప్రాజెక్టు ఉమ్మడి జలాశయంగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో మనందరికీ తెలుసు. అదే పరిస్థితి కండలేరుకు రాకూడదన్న ఉద్దేశంతో, రాపూరు మండలాన్ని మరియు కండలేరు రిజర్వాయర్ ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు,జిల్లా రైతాంగ ప్రయోజనాల కోసం,కండలేరుపై పూర్తి హక్కులు నెల్లూరు జిల్లాకే ఉండేలా చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే-1969లో నియమించబడిన బచావత్ ట్రిబ్యునల్,కృష్ణా జలాల పంపిణీపై చారిత్రక నివేదికను ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ 1976 ఒప్పందం ప్రకారం 1977లో తీసుకున్న నిర్ణయంతో చెన్నైకి తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. రాయలసీమకు నీటిని అందించే విషయంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోమశిల జలాశయంలో ఏ రోజూ కూడా 36 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసిన సందర్భాలు లేవు జగన్ మోహన్ రెడ్డిరాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచే చంద్రబాబుకు అది ఒక సమస్యగా పరిణమించింది,అందుకే ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు రాయలసీమ,ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నాడు,కానీ జగన్ ప్రభుత్వం రాయలసీమ ప్రకాశం,నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేసింది మాజీ ముఖ్యమంత్రి,దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నెల్లూరు జిల్లా రైతాంగంపై ఉన్న మమకారంతో సోమశిల జలాశయ సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచారు సోమశిల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలంటే కడప జిల్లాలోని ముంపు గ్రామాలను తరలించడం అత్యవసరమని గుర్తించిన రాజశేఖర్ రెడ్డి, అది తన సొంత జిల్లా అయినప్పటికీ నెల్లూరు రైతుల ప్రయోజనాల కోసం పనిచేశారు రాజశేఖర రెడ్డి చొరవతో సోమశిల సామర్థ్యం 78 టీఎంసీలకు పెరిగింది. చరిత్రలో మొదటిసారిగా 72 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి రికార్డు సృష్టించిన ఘనత ఆయనకే దక్కుతుంది- కండలేరు ద్వారా సాగునీటి భరోసా సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీటిని తరలించడం ద్వారా జిల్లాలోని మరికొన్ని సాగు భూములకు భరోసా కల్పించింది కండలేరు జలాశయంలో రికార్డు స్థాయిలో 63 టీఎంసీల నీటిని నిల్వ చేయడం సాధ్యమైంది.దీనివల్ల ఆ రోజు నుంచి నేటి వరకు జిల్లా రైతాంగం సస్యశ్యామలంగా ఉంది ప్రస్తుతం రెండో పంటకు నీళ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకులు,ఆ నీటిని నిల్వ చేసే వ్యవస్థను నిర్మించింది వైఎస్సార్ అని మర్చిపోకూడదు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా సాగునీటి రంగానికి చేసిన మేలును అంగీకరించాల్సిన అవసరం ఉంది-వైఎస్సార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్లే నేడు నెల్లూరు జిల్లాలో రెండో పంటకు నీరు అందుతోంది,సోమశిల,కండలేరు ప్రాజెక్టులే జిల్లాకు జీవనాధారాలు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత,సోమశిల కండలేరు వరద కాలువ సామర్థ్యాన్ని 12 వేల నుండి 24 వేల క్యూసెక్ లకు పెంచి పనులు ప్రారంభించారు,కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైనా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు- 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు,సంగం నెల్లూరు బ్యారేజీని ఒక్క సీజన్‌లోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చి, 2019 వరకు అధికారంలో ఉన్నా ఆ పని పూర్తి చేయలేకపోయాడు- రాజశేఖర్ రెడ్డి  పునాది వేసిన సంగం,నెల్లూరు బ్యారేజీని పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేసిన ఘనత కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి కే దక్కుతుంది- ఈరోజు మనం ఏదైనా సాధించామంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారు, జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది తప్ప, మరెవరి వల్ల కాదు- నీటి పంపకాలపై రైతులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశంలో,పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చించాల్సింది పోయి,నాబార్డ్ నిధుల పంపిణీలో తమకు వాటా రాలేదని అధికార పార్టీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటు(IAB) సమావేశం లో మంత్రి నారాయణే రూ.50 కోట్లు తీసుకెళ్ళిపోవాలా  మేమంతా గెలవలేదా మాకు వాటా వద్దా అని సోమిరెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే వాదించుకోవడం చూస్తుంటే ప్రభుత్వానికి రైతుల కంటే సొంత లాభాలే ముఖ్యమని అర్థమవుతోంది రైతుల పేరిట ఇరిగేషన్ లో’దొంగ బిల్లులు’సృష్టించి కోట్ల రూపాయల నిధులు కాజేశారు నీరు చెట్టు, నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత,వంటి పథకాలకు చంద్రబాబు నాయుడు ఆకర్షణీయమైన పేర్లు పెడతారు,క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు,మంత్రులు, జెసిబిలతో దిగి కొబ్బరికాయలు కొట్టి నిధులు ఎలా కొల్లగొట్టాలనే ఆలోచన చేస్తున్నారే తప్ప రైతుల గురించి ఆలోచన చేసిన దాఖలాలు లేవు- సోమశిలకు సంబంధించిన పెండింగ్ పనులను గానీ, రైతులకు అందాల్సిన సాగునీటి అవసరాలను గానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు- సోమశిల జలాశయానికి పూర్తిస్థాయిలో నీరు అందాలంటే’రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అత్యంత ప్రధానమైనది- పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రతిరోజూ సుమారు 8 టీఎంసీల నీటిని లిఫ్ట్ ద్వారా తీసుకెళ్లిపోతోంది,ఈ నేపథ్యంలో మన వాటాను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది- దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎన్నో విమర్శలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11000 క్యూసెక్కుల నుండి 44,000 క్యూసెక్కులకు పెంచారు- రాయలసీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయంగా అందరం కలిసి పోరాటాలు చేసి చంద్రబాబు మెడలు వంచి సాధించుకుంటాం