prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 7:03 am Digital Edition : PRAJA VANI

మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ

*మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ*

* *మన ప్రజావాణి*, *మందమర్రి రూరల్*:- మే 27

మండలంలోని పొన్నారం గ్రామంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ పెంచాల మధు, మహిళా సంఘ సభ్యులు, అధికారులు, రాజకీయ నాయకులు హాజరై, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ పెంచాల మధు మాట్లాడుతూ, ఈ భవనం గ్రామంలోని మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కడారి జీవన్ కుమార్, ఏపిఓ ఎస్తార్ డేవిడ్, ఏపిఎం చంద్రశేఖర్, పంచాయతీ రాజ్ ఏఈ ఇసాక్,టిఏ రాజలింగు, గ్రామ పంచాయతీ కార్యదర్శి హరీష్, మహిళా అధ్యక్షురాలు గోగు సుమలత, గ్రామ ఉపసర్పంచ్ పెంచాలా అమృత, వార్డ్ సభ్యులు సుర్మిల పద్మ, కాంగ్రెస్ నాయకులు,  పెంచాల రాయలింగు, నీలం ఆనంద్, మాసు సంతోష్, పూసాల సంతోష్, బేర సమ్మయ్య, గ్రామ పెద్దలు పెంచాల ముత్తయ్య లు పాల్గొన్నారు.