prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 7:50 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్

కలువాయి (మే21ప్రజావాణి) మండలంలోని  ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ మండల స్టాక్ పాయింట్ (నిల్వ మరియు భద్రపరిచే పాఠశాల) అయిన బీవీఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా సమగ్ర శిక్ష విద్యా విషయక పర్యవేక్షణ అధికారి జి.సుధీర్ బాబు, జిల్లా సహిత విద్య కోఆర్డినేటర్ ప్రసాద్ రావు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వంఉచితంగా అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ సంబంధించి మండల స్టాక్ పాయింట్ (నిల్వ మరియు భద్రపరిచే పాఠశాల) బి వి ఎన్ ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలువాయ ను జిల్లా సమగ్ర శిక్ష విద్యావిషయక పర్యవేక్షణ అధికారి జి.సుధీర్ బాబు గారు మరియు జిల్లా సమగ్ర శిక్షసహిత విద్య కోఆర్డినేటర్ ప్రసాద్ రావు గారు తదితరులు సందర్శించి విద్యా మిత్ర కిట్స్ ఇప్పటివరకు ఏ వస్తువులు కేంద్రానికి చేరాయి త్వరలో ఏ వస్తువులు చేరబోతున్నాయి,ఏ విధంగా స్టాక్ పాయింట్ నందు నిల్వ మరియు భద్రపరుస్తున్నారనే విషయమై క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్ ను మరియు మండల విద్యాశాఖ సిబ్బంది నుండి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు స్టాక్ పాయింట్ సంబంధించిన అన్ని గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు.అనంతరం కలువాయి మెయిన్ ప్రాథమికపాఠశాల నందు నూతన భవిత సెంటర్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో లు నాగేశ్వరరావు,శ్రీహరి,వెంకటేశ్వర్లు మరియు మండల విద్యాశాఖ సిబ్బంది యానాదయ్య, బాలకృష్ణ మండల భవితా సెంటర్ సహిత విద్య ఉపాధ్యాయుడు విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.