పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఉపసంహరించుకోవాలి : మీసాల రాజేష్

ఘట్‌కేసర్, మే 18: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పోచారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మీసాల రాజేష్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజల జీవనం తీవ్రంగా ప్రభావితమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీసాల రాజేష్ మాట్లాడుతూ… ఇంధన ధరలు పెరగడంతో పాలు, పెరుగు, పప్పులు, నూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే రవాణా ఖర్చులు, విద్యా...